బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 22 అక్టోబరు 2024 (09:42 IST)

వీఐపీ బందోబస్తుకు వెళ్తే.. ఏఎస్ఐపై దాడి చేసిన కుక్కలు

dogs
అలంపూర్‌లో జోగులాంబ దేవాలయం వద్ద వీఐపీ బందోబస్తు కోసం గుమిగూడిన పోలీసు సిబ్బందిపై వీధికుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో బాషా అనే ఏఎస్‌ఐ గాయపడగా వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అలంపూర్‌లో వీధికుక్కల బెడద పెరిగిపోవడంతో ఆలయానికి వచ్చిన భక్తులు ఆందోళనకు దిగారు. 
 
అధికారులు చర్యలు తీసుకుని పరిస్థితిని అదుపు చేయాలని పలువురు కోరుతున్నారు. కర్ణాటక నుంచి శ్రీశైలానికి కాలినడకన వెళ్లే యాత్రికులు తుంగభద్ర నది, చుట్టుపక్కల నల్లమల అడవుల్లో కుక్కలను వదిలేయడం ఈ సమస్యకు కారణమని స్థానికులు చెబుతున్నారు. వీధికుక్కల బెడదపై అధికారులు స్పందించి ప్రజలకు భద్రత కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.