నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి... ఏంటది?
తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. వచ్చే రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలపై ఉన్నతాధికారులతో ఒక సమీక్షా సమావేశం నిర్వహిచనున్నారు. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్‌కు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు టీఎస్ పీఎస్సీ నిర్వహించిన పోటీ పరీక్షలు, రిలీజ్ చేసిన నోటిఫికేషన్ల వివరాలతో ఈ సమీక్షా సమావేశానికి రావాలని ఆదేశించారు.
ఇదిలావుంటే, యేడాదిన్నర నుంచి రాష్ట్రంలో పలు పరీక్షల ప్రశ్నపత్రాల లీక్ వ్యవహారం, పరీక్షల వాయిదాల పర్వంతో నియామకాలు విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొత్త సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది. వాయిదా పడిన పరీక్షలను వెంటనే నిర్వహిస్తుందా లేదా టీఎస్ పీఎస్సీ బోర్డును పూర్తిగా ప్రక్షాళన చేసి, ఈ పరీక్షలను నిర్వహిస్తుందా అనేది తెలియాల్సివుంది.