1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 21 ఫిబ్రవరి 2024 (11:06 IST)

రూ. 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల విద్యుత్.. శ్రీధర్ బాబు

Sridhar babu
రూ. 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు విద్యుత్‌పై తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన చేశారు. గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలను త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. 200 యూనిట్ల వరకు విద్యుత్‌ వినియోగించేవారి నుంచి ఛార్జీలు వసూలు చేయబోమని చెప్పారు. గ్యాస్‌ సిలిండర్‌కు రూ.500 రాయితీ ఇస్తామని అన్నారు.
 
తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ పరిమితిని పెంచారు. తాజాగా.. మరో రెండు గ్యారంటీల అమలుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా రూ. 500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో నిధులు కూడా కేటాయించారు.