బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 21 ఫిబ్రవరి 2024 (09:48 IST)

సందీప్ రెడ్డి వంగాకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు

Sandeep Reddy Vanga
Sandeep Reddy Vanga
ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కథానాయకుడిగా నటించిన 'యానిమల్' చిత్రానికి గాను ఆయనకు ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్లు వసూలు చేసి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది యానిమల్. యానిమల్ సినిమాలో అబ్రార్ పాత్రను అద్భుతంగా పోషించినందుకు బాబీ డియోల్ నెగెటివ్ రోల్‌లో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు.  
 
అలాగే అట్లీ దర్శకత్వం వహించిన జవాన్ చిత్రంలో నటనకు గాను షారుఖ్ ఖాన్, నయనతార వరుసగా ఉత్తమ నటుడు, ఉత్తమ నటి అవార్డులను గెలుచుకున్నారు. దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డుల ప్రదానోత్సవం మంగళవారం ముంబైలో జరిగింది. 
 
అవార్డుల వివరాలు
ఉత్తమ నెగెటివ్ యాక్టర్- బాబీ డియోల్ (యానిమల్)
ఉత్తమ దర్శకుడు-సందీప్ రెడ్డి వంగా (యానిమల్)
ఉత్తమ నటి- నయనతార (జవాన్)
ఉత్తమ నటుడు- షారుఖ్ ఖాన్ (జవాన్)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్) – విక్కీ కౌశల్ (సామ్ బహదూర్)
ఉత్తమ సంగీత దర్శకుడు- అనిరుధ్ రవిచందర్
ఉత్తమ నేపథ్య గాయకుడు -వరుణ్ జైన్ (తేరే వాస్తే (జరా హట్కే జరా బచ్కే)
ఉత్తమ నేపథ్య గాయని -శిల్పారావు (పఠాన్)
సంగీత రంగంలో విశేష కృషి - కె.జె.యేసుదాస్
చిత్ర పరిశ్రమలో విశేష కృషి - మౌషుమి ఛటర్జీ
టెలివిజన్ సిరీస్ ఆఫ్ ది ఇయర్- ఘుమ్ హై కిసికే ప్యార్ మే
టెలివిజన్ ధారావాహికలో ఉత్తమ నటుడు- నీల్ భట్ (ఘుమ్ హై కిసికే ప్యార్ మే)
టెలివిజన్ సిరీస్‌లో ఉత్తమ నటి - రూపాలీ గంగూలీ (అనుపమ)
వెబ్ సిరీస్‌లో ఉత్తమ నటి - కరిష్మా తమన్నా (స్కూప్)