శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 19 డిశెంబరు 2023 (13:23 IST)

తెలంగాణ భవిష్యత్ కూడా ఇదేనా? కాంగ్రెస్ హామీలపై కేటీఆర్ ప్రశ్న?

ktrao
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఆరు ప్రధాన హామీలను ఇచ్చింది. అధికారంలోకి వస్తే ఆ హామీలను తప్పకుండా అమలు చేసితీరుతామని ఘంటాపథంగా చెప్పారు. ఇదే తరహా హామీలతోనే కర్నాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే, ఆ హామీలను అమలు చేయలేక కర్నాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసేలా ఉంది. 
 
తాజాగా కర్నాటక అసెంబ్లీలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు వాస్తవ పరిస్థితిని స్పష్టం చేస్తున్నాయి. డబ్బులు ఎక్కడి నుంచి తెస్తాం? ఎన్నికల సమయంలో మేము హామీలు ఇచ్చిన నిజమేనా? చెప్పినవన్నీ చేయడం సాధ్యమేనా? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఎన్నికల్లో ప్రజలను సక్సెస్‌ఫుల్‌గా మభ్యపెట్టి అదికారంలోకి వచ్చారని, తెలంగాణ భవిష్యత్ కూడా ఇదేనా? అని ప్రశ్నించారు. భారీ ప్రకటనలు చేసే ముందు మీరు కనీస అధ్యయనం, ప్లానింగ్ చేయాల్సిన అవసరం లేదా అని ఆయన ప్రశ్నించారు. 

తమిళనాడును ముంచెత్తిన వరదలు - రైళ్లలోనే 800 మంది ప్రయాణికులు 
 
తమిళనాడు రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. మిచౌంగ్ తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాలతో చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాలు వరద ముంపులో చిక్కుకున్నాయి. ఇపుడు దక్షిణాది జిల్లాల్లో వరద బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా తిరునెల్వేలి, తూత్కుక్కుడి, కన్యాకుమారి, తెన్‌కాశి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. 
 
ఈ కారణంగా ఈ నాలుగు జిల్లాలను వరద నీరు ముంచెత్తింది. తిరుచ్చెందూరు నుంచి చెన్నైకు వెళుతున్న ప్రయాణికుల రైలు వరద నీటిలో చిక్కుకుని పోయింది. శ్రీవైకుంఠం వద్ద ఈ రైలు గత 20 గంటలుగ నిలిచిపోయివుంది. ఇందులో సుమారుగా 800 మంది ప్రయాణికులు ఉన్నారు. మరో 300 మంది సమీపంలోని ఓ పాఠశాలలో ఆశ్రయం పొందుతున్నారు.
 
తిరునల్వేలి - తిరుచెందూర్ సెక్షన్‌లో శ్రీవైకుంఠం వద్ద వంతెన కొట్టుకుని పోయింది. దీంతో ట్రాక్ నీటిపై వేలాడుతుంది. రైలు పట్టాలపై నీరు ప్రవహిస్తున్నందున దక్షిణ రైల్వే ట్రాఫిక్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. తమిళనాడులో భారీ వర్షాల కారణంగా సాధారణ జీవితం అస్తవ్యస్తమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సేవలను కోరింది. వర్ష ప్రభావిత జిల్లాల నుంచి వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.