మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 13 డిశెంబరు 2023 (18:00 IST)

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా ప్రజాభవన్

pragathi bhavan
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా ప్రజాభవన్‌ను తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ప్రగతి భవన్‌ను మహాత్మా జ్యోతిరావు పూలె ప్రజాభవన్‌గా మార్చిన విషయం తెల్సిందే. ఇదే భవనంలోనే ప్రజాదర్బార్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి మంగళ, శుక్రవారాల్లో నిర్వహిస్తున్నారు. ఇపుడు ఈ భవనాన్ని తెలంగాణ ప్రభుత్వం మల్లు భట్టివిక్రమార్కకు అధికారిక నివాసంగా కేటాయించింది. 
 
మరోవైపు, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కోసం భవన అన్వేషణ చేస్తున్నారు. భాగ్యనగరిలోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి శిక్షణా కేంద్రాన్ని పరిశీలిస్తున్నారు. ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉండటంతో పాటు భద్రతాపరంగా అనుకూలంగా ఉంటుందని, వాహనాల పార్కింగ్‌కు కూడా సౌలభ్యంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. దీంతో సీఎం రేవంత్ క్యాంపు కార్యాలయంగా ఈ భవనాన్ని ఎంపిక చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.