సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Modified: మంగళవారం, 13 జూన్ 2017 (21:04 IST)

విద్యార్థిని పూర్ణిమ కిడ్నాపా...? వెళ్లిపోయిందా...? 5 రోజులుగా....

ఈమధ్య కాలంలో అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో 15 ఏళ్లు కూడా నిండని బాలికలు అదృశ్యమవుతుండటం కలకలం సృష్టిస్తోంది. కారణాలు ఏమయినప్పటికీ 13 ఏళ్ల నుంచి 18 ఏళ్ల లోపు బాలికలు మిస్ అవుతున్నారు. ఐదు రోజుల కిందట హైదరాబాదు నగర శివారులోని బాచుపల్లి పీఎస్

ఈమధ్య కాలంలో అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో 15 ఏళ్లు కూడా నిండని బాలికలు అదృశ్యమవుతుండటం కలకలం సృష్టిస్తోంది. కారణాలు ఏమయినప్పటికీ 13 ఏళ్ల నుంచి 18 ఏళ్ల లోపు బాలికలు మిస్ అవుతున్నారు. ఐదు రోజుల కిందట హైదరాబాదు నగర శివారులోని బాచుపల్లి పీఎస్ పరిధిలో ముగ్గురు విద్యార్థినులు అదృశ్యం అయ్యారు. వీరిలో ఒకరి జాడ గుర్తించారు. మరో ఇద‍్దరి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. 
 
ఐదు రోజుల కిందట అదృశ్యమైన 10 వతరగతి విద్యార్థిని పూర్ణిమ జాడ లేకపోవడంతో ఆమె తల్లి విజయ కన్నీటిపర్యంతమవుతున్నారు. పూర్ణిమ సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో చాలా యాక్టివుగా వుండేదని తెలుస్తోంది. ఐతే ఆమె మిస్ అయిన దగ్గర్నుంచి ఆమె ఖాతాలో వున్న పోస్టింగులన్నీ డిలీట్ అయిపోయాయి. దీనిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
 
మరోవైపు విద్యార్థినికి ఎవరితోనూ గొడవులు లేవనీ, అందరితో కలుపుగోలుగా వుండేదని తెలుస్తోంది. తమతో వైరం వున్నవారెవరైనా ఈ పని చేసి వుంటే దయచేసి తమ కుమార్తెను విడిచి పెట్టాలనీ వేడుకుంటున్నారు. పోలీసులు పలు కోణాల్లో విచారణ చేస్తున్నారు. కాగా ఆమె పెద్దలపై అలిగి వెళ్లిపోయిందా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.