68 రోజులపాటు బాలిక ఉపవాసం... మంచి జరుగుతుందనీ... కానీ ప్రాణం పోయింది...

మనం ఒక్కపొద్దు, రోజంతా ఉపవాసం, జాగారాం, అన్నపానీయాలు మాని ఉపవాస వ్రతం వంటివి వింటూ ఉంటాం. కానీ హైదరాబాదులో జైన మతానికి చెందిన ఓ కుటుంబం 13 ఏళ్ల బాలికతో చేయించిన ఉపవాసం ఆమె ప్రాణాన్ని కబళించింది. నీ ఉపవాసం ఇంటికి మంచిదంటూ 68 రోజుల పాటు 13 ఏళ్ల జైన బాల

jain-girl
ivr| Last Modified శనివారం, 8 అక్టోబరు 2016 (15:36 IST)
మనం ఒక్కపొద్దు, రోజంతా ఉపవాసం, జాగారాం, అన్నపానీయాలు మాని ఉపవాస వ్రతం వంటివి వింటూ ఉంటాం. కానీ హైదరాబాదులో జైన మతానికి చెందిన ఓ కుటుంబం 13 ఏళ్ల బాలికతో చేయించిన ఉపవాసం ఆమె ప్రాణాన్ని కబళించింది. నీ ఉపవాసం ఇంటికి మంచిదంటూ 68 రోజుల పాటు 13 ఏళ్ల జైన బాలికతో చేయించిన ఉపవాసం వికటించింది.

ఒక్కో మతానికి ఒక్కో సంప్రదాయం ఉంటుందన్నది మనకు తెలిసిందే. ఈ క్రమంలో జైన మ‌త సంప్ర‌దాయం ప్ర‌కారం ఆరాధ‌న అనే బాలిక 68 రోజులు పాటు తన కుటుంబానికి మంచి జరగాలని ఉపవాస వ్రతం చేసింది. ఈ ఉపవాసం చేస్తుండగానే ఆమె తీవ్రమైన అస్వస్థతకు లోనైంది. ఉపవాసం చేస్తున్న సమయంలో కనీసం పచ్చి మంచినీళ్లు కూడా తాగలేదు. దీనితో ఆమె ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిని కొన్ని అవయవాలు పనిచేయడం మానేశాయని సమాచారం. ఆసుపత్రికి తీసుకెళ్లినా ఆమెను వైద్యులు కాపాడలేకపోయారు.దీనిపై మరింత చదవండి :