గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 5 మార్చి 2022 (17:54 IST)

షీ టీమ్స్ ఆధ్వర్యంలో 2కె, 5కె రన్: మార్చి 6 ఉదయం టాంక్‌బండ్, నెక్లెస్ రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు

మహిళలకు ప్రతిరోజూ సురక్షితమైన వాతావరణాన్ని అందించడమే కాకుండా, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నగరంలోని మహిళలకు ప్రత్యేక అనుభూతిని కలిగించేలా షీ టీమ్స్ హైదరాబాద్ జాగ్రత్తలు తీసుకుంటోంది.

 
'సుస్థిరమైన రేపటి కోసం ఈ రోజు లింగ సమానత్వం' అనే థీమ్‌కు అనుగుణంగా, షీ టీమ్‌లు మార్చి 6న పీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్‌లో జెండర్ ఈక్వాలిటీ 2K, 5K రన్‌ను నిర్వహిస్తున్నాయి. ఈ రెండింటిలో పాల్గొనేందుకు ఇప్పటికే పలువురు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని మార్చి 6న ఉదయం వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు జెండా ఊపి ప్రారంభిస్తారు.

 
షీటీమ్స్ ఆధ్వర్యంలో రేపు 5కే, 2కే రన్ నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్ మీదుగా సాగుతుండటంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు వుంటాయని ట్రాఫిక్ పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఆంక్షలు రేపు ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు వుంటాయని, వాహనదారులు గమనించాలని తెలిపారు.