గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Selvi
Last Updated : శనివారం, 26 డిశెంబరు 2015 (12:17 IST)

ఐఎస్ఐఎస్‌లో చేరేందుకు వెళ్లిన ముగ్గురు హైదరాబాదీల అరెస్ట్!

ఐఎస్ఐఎస్‌లో చేరే యువకుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోన్న ఐఎస్‌లో చేరేందుకు వెళ్తూ వెళ్తూ శుక్రవారం నాగ్‌పూర్‌లో ముగ్గురు హైదరాబాదీ యువకులు పోలీసులు చిక్కారు. హైదరాబాదు నుంచి శుక్రవారం సాయంత్రానికి రోడ్డు మార్గం మీదుగా నాగపూర్ చేరుకున్న సదరు యువకులు అక్కడి నుంచి జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌కు బయలుదేరేందుకు ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక దళం (ఏటీఎస్) పోలీసులతో కలిసి తెలంగాణ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. 
 
విచారణలో ఆ ముగ్గురు 20 ఏళ్ల వయస్సున్న వారని.. హైదరాబాద్‌కు చెందిన వారని తేలింది. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న సదరు యువకులు ఐఎస్ చేరేందుకే ఆఫ్ఘనిస్థాన్ బయలుదేరారు. తమ పిల్లల ఆచూకీ లభించడం లేదని వారి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో క్షణాల్లో రంగంలోకి దిగిన తెలంగాణ పోలీసులు మహారాష్ట్ర పోలీసులను అప్రమత్తం చేసి నాగపూర్‌లో అదుపులోకి తీసుకున్నారు.