ప్రణయ్‌లా పరువు హత్య.. హేమంత్ సినిమా హీరో.. అందమైన మాయలో..? (Video)

Andamaina Maya
సెల్వి| Last Updated: శనివారం, 26 సెప్టెంబరు 2020 (16:35 IST)
Andamaina Maya
ప్రణయ్‌లా పరువు హత్యకు గురైన హేమంత్‌కు సంబంధించిన కీలక అంశం వెలుగులోకి వచ్చింది. కులాంతర వివాహం చేసుకోవడంతో హేమంత్‌ను కిడ్నాప్ గురై.. ఆపై హత్యకు గురయ్యాడనే విషయం తెలిసిందే. తాజాగా అతని గురించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే హేమంత్ కొన్నేళ్ళ క్రితం ఒక సినిమాలో హీరోగా నటించాడు.

విశ్వశ్రీ ఆర్ట్స్ బ్యానర్ మీద నాగరాజు కొట్టే నిర్మించిన ఆ సినిమా పేరు అందమైన మాయ. మణీంద్రన్ అనే ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2015లో జరిగింది. అప్పట్లో ఈ సినిమా రిలీజ్ పోస్టర్‌‌ను అప్పుడు తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అప్పుడు మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) అధ్యక్షుడుగా ఉన్న రాజేంద్ర ప్రసాద్‌లు విడుదల చేశారు.

కార్తీక్, భవ్యశ్రీ, చిరు సాయి, శృతి, హేమంత్ ‌లు ఇందులో హీరో హీరోయిన్లుగా నటించారు. హారర్ కామెడీగా వచ్చిన ఈ సినిమాకి సత్య సోమేష్ సంగీతాన్ని అందించారు. ప్రేమ్ జై సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు.

ఇకపోతే హేమంత్‌ను మద్యం సేవించి మత్తులో హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. తాడుతో మెడకు బిగించి హేమంత్‌ను నిందితులు హత్య చేసినట్టు గుర్తించారు. సంగారెడ్డి మల్కాపూర్‌లో హేమంత్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.

దీనిపై మరింత చదవండి :