గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (12:00 IST)

అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిస్వాపై కేసు నమోదు

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఉద్దేశించిన అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంపై అస్సాం ముఖ్యమంత్రి హిమాంత్ బిశ్వ శర్మపై హైదరాబాద్ నగరంలో కేసు నమోదైంది. హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫిర్యాదు మేరకు అస్సాం సీఎంపై మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 
 
రాహుల్ గాంధీ డీఎన్‌ఏను టెస్ట్ చేయాలన్న హిమాంత్ బిశ్వా అహంకారపూరిత వ్యాఖ్యలు మహిళను అవమానపరిచేలా, కించపరిచేలా ఉన్నాయని, అందువల్ల ఆయనపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి సోమవారం చేసిన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
 
పైగా, తన ఫిర్యాదు తర్వాత అస్సాం ముఖ్యమంత్రిపై కేసు పెట్టకపోతే పోలీస్ స్టేషన్‌ను ముట్టడిస్తామని రేవంత్ రెడ్డి పోలీసులకు తెలిపారు. దీంతో దిగివచ్చిన పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. మొత్తం మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.