శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By selvi
Last Updated : గురువారం, 4 అక్టోబరు 2018 (14:46 IST)

అప్పుడు కేసీఆర్ చేస్తే కరెక్ట్.. ఇప్పుడు మేం చేస్తే తప్పా.. అదెలా?- బండ్ల గణేశ్

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం నిజామాబాద్ జిల్లాలోని ప్రజాశీర్వాద సభలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగిన సంగతి తెల

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం నిజామాబాద్ జిల్లాలోని ప్రజాశీర్వాద సభలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. ఓటుకు నోటులో దొరికిన దొంగ అని, అలాంటి వ్యక్తితో పొత్తు పెట్టుకుంటారా.. తూ మీ బతుకులు చెడ అంటూ కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు.
 
కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు సైతం ప్రతి విమర్శలు చేశారు. అయితే కేసీఆర్ కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడటంపై.. ప్రముఖ సినీ నిర్మాత, ప్రస్తుత కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ స్పందించారు. 
 
రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి 104 స్థానాల్లో గెలవడం సాధ్యమని కాంగ్రెస్ నేత, సినీ నటుడు బండ్ల గణేష్ ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలే కాంగ్రెస్‌ను గెలిపిస్తాయని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు. అలంపూర్‌లో బండ్ల గణేష్ మీడియాలో మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు తల్లి బీజేపీ, పిల్ల బీజేపీ (టీఆర్ఎస్)కి-కాంగ్రెస్ పార్టీకి మధ్య జరుగుతున్న యుద్ధమన్నారు. 
 
గతంలో కాంగ్రెస్, టీడీపీలో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుందని.. టీడీపీతో వారు పొత్తు పెట్టుకుంటే కరెక్ట్... కాంగ్రెస్ పెట్టుకుంటే తప్పా అని బండ్ల గణేష్ మండిపడ్డారు. ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్న ఈ సంగ్రామంలో ధర్మానిదే విజయమని చెప్పారు.