శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : బుధవారం, 3 అక్టోబరు 2018 (17:53 IST)

ఊ అంటే కేసు.. ఉచ్చ పోస్తే కేసు.. కాంగ్రెస్ నేతల బతుకే కేసులు

తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలపై ఆ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తెరాస అధినేత కె.చంద్రశేఖర్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఊ అంటే కేసు.. ఉచ్చ పోస్తే కేసు.. కాంగ్రెస్ పార్టీ నేతల బతుకే కేస

తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలపై ఆ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తెరాస అధినేత కె.చంద్రశేఖర్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఊ అంటే కేసు.. ఉచ్చ పోస్తే కేసు.. కాంగ్రెస్ పార్టీ నేతల బతుకే కేసుల మయం అంటూ విరుచుకుపడ్డారు.
 
బుధవారం నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రైతుబంధు పథకం కింద నవంబర్ నెలలో యాసంగి పంటకు ఎకరానికి రూ.4 వేల చొప్పున ఇస్తామని చెప్పినం. దీనిపై కాంగ్రెస్ పార్టీ వాళ్లు కేసు వేశారు. వాళ్ల బతుకే కేసు. ఊ అంటే కేసు.. ఉచ్చ పోస్తే కేసు. సొల్లు పురాణం చేస్తారు కాంగ్రెసోళ్లు. సొల్లు పురాణం మాట్లాడితే నాకు తిక్కరెగి ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు పోదామని చెప్పిన. ప్రజల వద్దకు వెళ్దామని చెప్పిన వెంటనే ప్రభుత్వాన్ని రద్దు చేయంగానే గిలగిల కొట్టుకుంటున్నారు. సుప్రీంకోర్టు, ఎలక్షన్ కమిషన్ వద్దకు పోయి అడ్డుకుంటున్నారు. ఎన్నికలకు పోదామా? అని ప్రశ్నించిన వారే.. ఎన్నికలను అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. 
 
పదవులంటే ఎడమకాలి చెప్పుల్లా విసిరేశాం. రాష్ట్రం స్థిరత్వంగా ఉండాలనే రద్దు చేశాం. కడుపు కట్టుకొని, నోరు కట్టుకొని అవినీతికి దూరంగా ఉండి పని చేసిన కారణంగా రాష్ట్ర ఆదాయం భారత్‌లోనే అగ్రస్థానంలో ఉంది. నాలుగేళ్లలో 17.17 శాతం ఆర్థిక ప్రగతి ఉంది. గడిచిన నాలుగైదు నెలల్లో 19.83 శాతం ఆర్థిక ప్రగతి ఉందన్నారు. ఈ ప్రగతి ఎట్ట సాధ్యమైంది. అవినీతి లేకుండా ఉండటం వల్లే ఇది సాధ్యమైందన్నారు.