గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : బుధవారం, 3 అక్టోబరు 2018 (20:57 IST)

నోరు తెరిచానంటే తెల్లారే వరకు తిడతా... అడ్డంగా దొరికిన దొంగ చంద్రబాబు : కేసీఆర్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తెరాసలో వచ్చిన కొత్తలో ఆయనకు బలం లేకపోయినా ఇక్కడ రాజకీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తెరాసలో వచ్చిన కొత్తలో ఆయనకు బలం లేకపోయినా ఇక్కడ రాజకీయ అస్థిరత తేవాలనే ఉద్దేశంతో ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ చంద్రబాబు అని కేసీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
 
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను దాచి దాచి దెయ్యాలకు అప్పగించినట్టు.. చంద్రబాబుకు అప్పగిద్దామా? అని కేసీఆర్ ప్రజలనుద్దేశించి ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రజలు ఆలోచించాలన్నారు. తెలంగాణ ప్రాజెక్టులు ఆపాలని చంద్రబాబు కేంద్రానికి లేఖలు రాశారని, 7 మండలాలు గుంజుకున్న దుర్మార్గుడు చంద్రబాబు అని, మనకు కరెంటు ఇవ్వకుండా రాక్షాసానందం పొందిన రాక్షసుడు కూడా చంద్రబాబేనని కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆంధ్రా రాక్షసి చంద్రబాబు అంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు. 
 
అలాగే, కాంగ్రెస్ పార్టీ నేతలు తనపై చేస్తున్న విమర్శలు, తిడుతున్న తిట్లపై ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తనపై చేసిన విమర్శలపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న తనను అలా తిట్టొచ్చా అని కార్యకర్తలను ప్రశ్నించారు. ఎవరిది చెడ్డ నోరో చెప్పాలంటూ కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. తన నోరు కూడా చెడ్డదేనని... నోరు తెరిచానంటే తెల్లారే వరకు తిడతా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.