రవితేజ తమ్ముడికి బ్లూ ఫిలిమ్స్, నాపై గ్యాంగ్ రేప్: సంచలన ఆరోపణలు చేసిన మహిళ రాధారమణి
మీడియా ముందు భాజపా నేత, న్యాయవాది రఘునందన్ రావుపై సంచలన ఆరోపణలు చేశారు బాధితురాలు రాధారమణి. మీడియాతో ఆమె మాట్లాడుతూ... 2003లో తన మాజీ భర్తపై ఓ కేసుకు సంబంధించి రఘునందన్‌ను కలిశాననీ, ఆ సమయంలో తనకు సాయం చేస్తానని చెప్పి తన మాజీ భర్తతో కలిసి తనపై లైంగిక దాడి చేశారని ఆరోపించారు. తనపై జరిగిన దాడికి సంబంధించి పోలీసు కేసు పెడదామని వెళితే పోలీసులు కేసు నమోదు చేయలేదన్నారు.
తనకు సాయం చేస్తానని పిలిపించి పటాన్‌చెరులోని ఆయన ఇంట్లోనే తనపై లైంగికదాడి చేశారనీ, విషయం బయటికి చెబితే చంపుతామనీ, అత్యాచార దృశ్యాలను వీడియో తీశామని తనకు వార్నింగ్ ఇచ్చారని తీవ్ర ఆరోపణలు చేశారు తన మాజీ భర్త, రఘునందన్‌లు కలిసి వ్యభిచార ముఠాలను నడిపించడమే కాకుండా కేసుల కోసం వచ్చే మహిళలను లొంగదీసుకుని వారితో బ్లూ ఫిలిమ్స్ తీసి వాటినితో బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు.
తనకు తన కుమారుడికి ప్రాణ హాని వుందనీ, తమని కాపాడాలంటూ మీడియా ముందు ఆమె వెల్లడించారు.