శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వి
Last Modified: శనివారం, 17 అక్టోబరు 2020 (19:58 IST)

కాంగ్రెస్, బీజేపీ రెండూ ఎండమావులు వంటివి: మంత్రి హరీష్ రావు

కాంగ్రెస్, బీజేపీ నాయకులపైన మంత్రి హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు. వానాకాలంలో ఉసిళ్లు వచ్చినట్లు వాళ్లు వస్తారని, కానీ టీఆర్ఎస్ మాత్రం ప్రజలకు ఎప్పటికీ అందుబాటులో ఉంటుందని అన్నారు. దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారంలో దౌల్తాబాద్ మండలంలోని ముబారస్ పూర్‌లో ప్రసంగించిన హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు.
 
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు విద్యుత్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తే, అటు బీజేపీ వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించి తిప్పలు పెడుతోందని విమర్శించారు. ఈ రెండు పార్టీలు ఎండమావులు వంటివని తెలిపారు. వాటి వెంట వెళ్లడం వలన ఏమీ లాభం లేదని తెలిపారు. ఇదిలా ఉండగా టీఆర్ఎస్ నేత సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్య సమస్యలతో ఆగస్టులో మరణించారు. అక్కడ ఉపఎన్నికలు అనివార్యం అయ్యాయి.
 
ఈ క్రమంలో నవంబరు 3న పోలింగ్ నిర్వహంచనున్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ తరపున సోలిపేట రామలింగా రెడ్డి సతీమణి సోలిపేట సుజాత, కాంగ్రెస్ పార్టీ తరపున చెరుకు శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా రఘునంధనరావు పోటీలో ఉన్నారు. నవంబరు 3న ఎన్నికలు జరుగగా 10న ఫలితాలు రానున్నాయి.