శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : బుధవారం, 6 మే 2020 (11:12 IST)

యాంకర్‌ శ్రీముఖిపై కేసు నమోదు... ఎందుకో తెలుసా?

ప్రముఖ యాంకర్‌ శ్రీముఖిపై బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. నల్లకుంటకు వెంకట రమణ శర్మ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

జెమినీ టీవీలో ప్రసారమయ్యే జూలకటక అనే కార్యక్రమంలో యాంకర్‌ శ్రీముఖి బ్రాహ్మణులను కించపరిచినట్లు వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ శర్మ బంజారాహిల్స్‌ పోలీసులను ఆశ్రయించారు.

శర్మ ఫిర్యాదు మేరకు శ్రీముఖితోపాటు, టీవీ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు.