శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Srinivas
Last Modified: బుధవారం, 13 జూన్ 2018 (17:45 IST)

పశువు రోడ్డెక్కితే.. యజమానికి జరిమానా ఎక్కడ?

మనం రోడ్డు మీద వెళుతూ ఉంటే.. ఒక్కోసారి పశువులు అడ్డొస్తూ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఆ ప్రమాదానికి కారకులెవరు? అడ్డొచ్చిన పశువులు మీద కేసు పెట్టాలా? అది సాధ్యం కాదు అందుకే సైబరాబాద్ పోలీసులు పశువుల యజమానుల్ని బాధ్యుల్ని చేయాలని కసరత్తు ప్ర

మనం రోడ్డు మీద వెళుతూ ఉంటే.. ఒక్కోసారి పశువులు అడ్డొస్తూ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఆ ప్రమాదానికి కారకులెవరు? అడ్డొచ్చిన పశువులు మీద కేసు పెట్టాలా? అది సాధ్యం కాదు అందుకే సైబరాబాద్ పోలీసులు పశువుల యజమానుల్ని బాధ్యుల్ని చేయాలని  కసరత్తు ప్రారంభించారు. పశువులు మూలంగా ప్రమాదాల జరగకపోయినా, కనీసం అవి రోడ్డు మీద పోలీసులకు కనిపిస్తే చాలు యజమానులకు చిక్కులు తప్పవు. 
 
ఈ విషయంపై కొంత భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నా మాకు వాహనదారుల భద్రతే ముఖ్యం అంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 93 కిలోమీటర్లు మేర అవుటర్ రింగ్ రోడ్ ఉంది. అవుటర్ రింగ్ రోడ్‌తో పాటు అంతర్గత ప్రధాన రహదారుల్లోనూ పశువుల  అడ్డదిడ్డంగా సంచరిస్తున్నాయి. సాధారణంగా అవుటర్ రింగ్ రోడ్డు మీద 100 కిలోమీటర్ల వేగంతో వాహనాలు వెళుతుంటాయి. 
 
ఈ వేగంతో వాహనాలు వెళ్లేటప్పడు పశువులు మూలంగా ప్రమాదాలు జరిగిన సందర్బాలు ఉన్నాయి.. అవుటర్ రింగ్ రోడ్డు చుట్టూ  పశువులు రాకుండా ఫినిషింగ్ ఏర్పాటు చేసినా కొందరు అతిక్రమించి ఫినిషింగ్ ను కట్ చేస్తున్నారు.. ఈ నేపథ్యంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 6 బృందాలు నిరంతరం గస్తీ కాస్తున్నాయి. ఆ బృందాలకు పశువలు కనిపిస్తే పట్టుకుని జీహెచ్ ఎంసీకి అప్పగించి యజమానులపై కేసులు పెట్టనున్నారు పోలీసులు.