మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 4 జూన్ 2021 (09:34 IST)

వైఎస్ షర్మిల పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు.. వైఎస్సార్ తెలంగాణ పార్టీగా..?

దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కుమార్తె వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెడుతున్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ పేరు వైస్సార్ తెలంగాణ పార్టీగా నామకరణం చేసినట్లు సమాచారం. అయితే తాజాగా వైస్సార్ తెలంగాణ పార్టీ గుర్తింపు కోరుతు ఎన్నికల సంఘాన్ని షర్మిల కోరినట్లు తెలుస్తుంది. వైస్సార్ తెలంగాణ పార్టీ పేరుపై అభ్యంతరాలు ఉంటే తెలపాలని ఎన్నికల కమిషన్ ప్రకటన చేసింది. 
 
ప్రస్తుతం షర్మిల రాజకీయ కార్యకలాపాల సమన్వయ కర్తగా రాజగోపాల్ వ్యవహరిస్తున్నాడు. ఈ పార్టీకి గుర్తింపు వచ్చిన తరువాత అధ్యక్షురాలిగా షర్మిలను ఎన్నుకునే అవకాశం ఉంటుందని సమాచారం. వైఎస్ షర్మిల పార్టీ పేరును వైఎస్సార్ తెలంగాణ పార్టీగా నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. 
 
వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో షర్మిల అనుచరుడు రోజగోపాల్ రిజిస్టర్ చేశారు. అలాగే వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఏర్పాటుకు సంబంధించిన‌ అన్ని పత్రాలను షర్మిల టీమ్ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు స‌మ‌ర్పించింది. వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుకు కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆమోదం తెలిపింది. కాగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుపై ఎవరికైనా ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 16 లోపు తెలపాలని పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు.