కేసీఆర్ సారూ.. గాంధీలో చేరండి.. ప్రజలకు ధైర్యం వస్తది..
కరోనా బారిన పడిన తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ఆస్పత్రిలో చేరాల్సి వస్తే సికింద్రాబాద్ గాంధీకి వెళ్లాలని నెటిజన్లు కోరుతున్నారు. గాంధీలో అన్ని వైద్య సదుపాయాలు ఉన్నాయని, కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం లేదని కేసీఆర్ గతంలో చెప్పారు.
వాస్తవ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. సిబ్బంది నిర్లక్ష్యం వల్ల చాలా మంది ప్రాణాలు వదులుతున్నారు. ఈ సమయంలో కేసీఆర్ గాంధీలో చేరితే, ప్రజలకు ధైర్యం వస్తుందని నెటిజన్లు సూచిస్తున్నారు.
కాగా, కేసీఆర్‌కు కరోనా వైరస్ సోకింది. ప్రస్తుతం ఆయన తన ఫాంహౌస్‌లో క్వారంటైన్‌లో ఉంటున్నారు. ఆయనకు కొంతమంది వైద్య బృందం వైద్యం అందిస్తూ, నిరంతరం పర్యవేక్షిస్తూ వస్తోంది.