శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శుక్రవారం, 6 మార్చి 2020 (06:26 IST)

కరోనా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే: భట్టి

కరోనా, సీఏఏ, ఎన్​పీఆర్​, ఎన్​సీఆర్​లతోపాటు బడ్జెట్​ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై సీఎల్పీలో సుదీర్ఘంగా చర్చిస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు.

ప్రభుత్వ వైఫల్యం కారణంగానే తెలంగాణలోకి కరోనా ప్రవేశించిందన్నారు. రాష్ట్రంలోకి కరోనా ప్రవేశించడాన్ని ప్రభుత్వ వైఫల్యంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అభివర్ణించారు. వైద్యారోగ్య అధికారుల నిర్లక్ష్యం కూడా ఉందన్నారు.

బడ్జెట్ కేటాయింపులు ప్రాధాన్య రంగాల ఆధారంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు కేటాయింపులు అధికంగా ఉండాలన్నారు.

బడ్జెట్ కేటాయింపులతో పాటు వాటిని మంజూరు చేసి ఖర్చు చేసినప్పుడే ఆశించిన ఫలితం వస్తుందని పేర్కొంది. సీఏఏ, ఎన్​పీఆర్​, ఎన్​ఆర్​సీలపై సుదీర్ఘంగా చర్చిస్తామని భట్టి అన్నారు.

ఎన్​పీఆర్ కోసం రూపొందించిన సర్వే ఫారంలో పొందుపరిచిన వివాదాస్పద అంశాలను తొలగిస్తూ ప్రత్యేకంగా జీవో ఇవ్వాలని డిమాండ్ చేశారు.