శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By selvi
Last Updated : శుక్రవారం, 6 అక్టోబరు 2017 (13:43 IST)

మేనకోడలు ప్రేమ వివాహం.. ఇంటి ముందే కాపురం.. మేనమామలు ఏం చేశారంటే?

మేనకోడలు ప్రేమించి వివాహం చేసుకోవడమే కాకుండా.. వారింటి ముందే కాపురం పెట్టడంతో మేనమామలు జీర్ణించుకోలేకపోయారు. చిన్నప్పటి నుంచి తండ్రి లేని బిడ్డ అని పెంచిన మేనకోడలు పెద్దల మాట వినకుండా ప్రేమలో పడి.. గ

మేనకోడలు ప్రేమించి వివాహం చేసుకోవడమే కాకుండా.. వారింటి ముందే కాపురం పెట్టడంతో మేనమామలు జీర్ణించుకోలేకపోయారు. చిన్నప్పటి నుంచి తండ్రి  లేని బిడ్డ అని పెంచిన మేనకోడలు పెద్దల మాట వినకుండా ప్రేమలో పడి.. గుడిలో పెళ్లి చేసుకుందని మేనమామలు మండిపోయారు. అంతే మేనకోడలిపై కక్ష  పెంచుకున్నారు. పెంచి పెద్ద చేసి డిగ్రీ వరకు చదివించిన మేనకోడలిని.. అతని భర్తను కిరాతకంగా హతమార్చి పరారైనారు. ఈ ఘటన వేములవాడ, బాలరాజుపల్లిలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. వేములవాడ మండలం బాలరాజుపల్లిలో ఇటీవలే ప్రేమించి పెళ్లి చేసుకున్న నేదూరి హరీష్‌-రచన దంపతులను రచన మేనమామలు నేదూరి శేఖర్‌, అశోక్‌, చింటులు దారుణంగా హతమార్చారు. చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి.. డిగ్రీ వరకు చదివించిన రచన మేనమామలు, పెళ్లి సంబంధాలు చూస్తున్న వేళ హరీష్ అనే యువకుడిని రచన ప్రేమ వివాహం చేసుకుంది. దీంతో రచన పరువు తీసిందని మేనమామలు కోపంతో ఊగిపోయారు. 
 
అంతటితో ఆగకుండా మేనమామల ఇంటి ముందే రచన కాపురం పెట్టడంతో సహించుకోలేకపోయిన రచన మేనమామలు, కత్తులు, కటార్లతో హరీష్ ఇంటిని చుట్టుముట్టారు. ఆపై అడ్డొచ్చిన హరీష్ తల్లిని గెంటేసి హరీష్, రచన దంపతులను కత్తులతో దాడి చేసి హతమార్చారు.