శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 14 జూన్ 2023 (08:15 IST)

కోర్టులో సెల్ ఫోన్ మోగింది.. రూ.100 జరిమానా... ఎక్కడ?

court
కోర్టులో నిశ్శబ్ధం తప్పనిసరి. అలాంటి కోర్టులో సెల్ ఫోన్ మోగడంతో జడ్జి అసహనం వ్యక్తం చేశారు. సదరు వ్యక్తిపై జరిమానా విధించారు. వివరాల్లోకి వెళితే.. గతేడాది జులై 1న హనుమకొండలోని బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకులు దాడి చేశారు. 
 
ఈ దాడిలో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణలతో పాటు మొత్తం 12 మందిపై హత్యాయత్నం కేసు పెట్టారు. 
 
ఈ కేసు మంగళవారం వరంగల్ జిల్లా మూడో అదనపు మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఎర్రబెల్లి స్వర్ణ ఫోన్ మోగింది. దీంతో ఆగ్రహించిన న్యాయమూర్తి కోర్టు వాతావరణాన్ని దెబ్బతిశారంటూ స్వర్ణ ఫోన్ స్వాధీనం చేసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. 
 
ఇంకా వంద రూపాయలు జరిమానా కూడా విధించారు. జరిమానా చెల్లించి జిల్లా న్యాయసేవాధికార సంస్థ నుంచి తన మొబైల్ ఫోన్‌ను స్వర్ణ వెనక్కు తెచ్చుకున్నారు.