శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శనివారం, 17 ఏప్రియల్ 2021 (22:48 IST)

క్షీణిస్తున్న షర్మిల ఆరోగ్యం

రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలంటూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల చేపట్టిన దీక్ష మూడో రోజు కూడా కొనసాగుతోంది.
 
ఆదివారం ఉదయం 11 గంటల తర్వాత షర్మిల దీక్ష విరమించనున్నారు. ప్రస్తుతం ఆమెకు డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి వైద్య పరీక్షలు నిర్వహించారు.
 
ఈ సందర్భంగా డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ షర్మిల ఆరోగ్యం క్షీణిస్తోందన్నారు. షర్మిల షుగర్ లెవెల్స్ 88 నుంచి 62కి తగ్గాయని చెప్పారు. షర్మిల రెండు కిలోల బరువు తగ్గారని చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.