శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఆర్. సందీప్
Last Modified: గురువారం, 7 మే 2020 (18:32 IST)

డబ్బుల్లేవు, అందుకే బిడ్డను అమ్మేశామంటున్న తల్లిదండ్రులు

ఆర్థిక ఇబ్బందులు చంటి బిడ్డను అమ్ముకునే స్థాయికి దిగజార్చాయి. మెదక్ జిల్లా చిలిప్‌చేడ్ మండలం చిటుకుల్ తండాలో శిశువును డబ్బు కోసం విక్రయించిన ఘటన చోటుచేసుకుంది. కేవలం 5 వేల రూపాయలకు పేగు తెంచుకుని పుట్టిన బిడ్డను కనికరం లేకుండా అమ్మేశారు. 
 
వివరాల్లోకి వెళితే సదరు తల్లిదండ్రులకు ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, మూడవ కాన్పు కూడా ఆడపిల్ల కావడంతో నిరాశ చెందారని, 4 రోజుల బిడ్డను అమ్ముకోవడానికి సిద్ధపడ్డారని ఆరోపణలు వస్తున్నాయి. అయితే తమ కొడుక్కి పుట్టిన మూడో ఆడపిల్లను అమ్మేసి, కొడుకుకి రెండో పెళ్లి చేయాలని కుటుంబపెద్దలు నిర్ణయించినట్లుగా కూడా వాదనలు వస్తున్నాయి. 
 
ఆడ శిశువును కొనుక్కున్నవారికి పిల్లలు లేకపోవడంతో బిడ్డను తీసుకున్నారని చెబుతున్నారు. ఇదంతా ప్రక్కన బెట్టి తల్లిదండ్రులను ప్రశ్నిస్తే ఆర్థిక సమస్యలు ఉండటం వల్ల బిడ్డను విక్రయించామని చెప్పుకొస్తున్నారు.