శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్

ఏపీలో కేసీఆర్ పార్టీకి రాష్ట్ర పార్టీ హోదా ఉపసంహరణ!

brs - electioncommission
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని భారత రాష్ట్ర సమితికి కేంద్ర ఎన్నికల సంఘం తేరుకోలేని షాకిచ్చింది. వచ్చే యేడాది జరిగే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఏపీలో కూడా పోటీ చేసి తన ఉనికిని చాటుకోవాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్‌కు ఈసీ ఊహించని షాక్ ఇచ్చింది. ఆంధ్రాలో ఆ పార్టీ రాష్ట్ర పార్టీ హోదాను ఉపసంహరించుకుంది. ఎన్నికల సింబల్స్ ఆర్డర్ 1968 పేరా 6 ప్రకారం ఎన్నికల సంఘం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 
 
సాధారణంగా రాష్ట్ర పార్టీగా గుర్తింపుపొందాలంటే ఆ రాష్ట్రంలో చివరగా జరిగిన ఎన్నికల్లో ఆరు శాతం ఓట్లుకానీ, మొత్తంగా అసెంబ్లీ స్థానాల్లో 3 శాతం సీట్లుగాని సాధించివుండాలన్న నిబంధన ఉంది. అటు 25 ఎంపీ సీట్లకు కనీసం ఒకటైనా గెలిచి ఉండాలి. పార్టీ అభ్యర్థులకు కనీసం 8 శాతం ఓట్లయినా వచ్చివుండాలి. ఈ ప్రకారంగా చూస్తే ఏపీలో బీఆర్ఎస్‌ ఒక్కసారిగా కూడా పోటీ చేయలేదు. అందువల్లే ఏపీలో బీఆర్ఎస్‌కు రాష్ట్ర పార్టీ హోదా దక్కలేదు. తెలంగాణాలో మాత్రం బీఆర్ఎస్‌కు రాష్ట్ర పార్టీ హోదా ఇస్తున్నట్టు ఈసీ తన ప్రకటనలో పేర్కొంది.