ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 13 డిశెంబరు 2021 (14:06 IST)

భూమికి పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వలేదనీ.. తండ్రీకొడుకులు...

రెవెన్యూ అధికారులు తమ భూమికి పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన తండ్రీ కొడుకులు జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యాయత్నినికి పాల్పడ్డారు. దీంతో అక్కడ ఉద్రికత వాతావరణం నెలకొంది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని ఆలేరు మండలం, కొలనుపాక గ్రామానికి చెందిన ఉప్పలయ్య అనే వ్యక్తికి 4 ఎకరాల భూమివుంది. ఈ భూమిని 20 యేళ్ల క్రితం 6 వేల రూపాయలకు కొనుగోలు చేశారు. అయితే, అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ భూమి పట్టాదారు పాస్ పుస్తకం కోసం రెవెన్యూ అధికారుల చుట్టూ ఉప్పలయ్య ఆయన కుమారుడు మహేష్‌లు తిరుగుతూనే ఉన్నారు. 
 
కానీ, వారు ఏమాత్రం కనికరించ లేదు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఉప్పలయ్య, ఆయన కుమారుడు మహేష్‌లు తమ వెంట తెచ్చుకున్న కిరోసిన్‌ను పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. అయితే, ఆ సమయంలో అక్కడున్నవారు అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సమచారం తెలుసుకున్న అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆ ఇద్దరిని పిలిచి మాట్లాడి.. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.