ఔటర్ రింగు రోడ్డులో డివైడ్‌ను ఢీ కొట్టిన కారు, ఐదుగురికి తీవ్రగాయాలు.. పరిస్థితి విషమం
హైదరబాద్ మహానగర శివారు ఔటర్ రింగ్ రోడ్డుపై వేగంగా ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ఘటన రాజేంద్రనగర్ సమీపంలోని ఓఆర్ఆర్‌పై జరిగినట్లు పోలీసులు తెలిపారు. హిమాయత్ సాగర్ వద్ద స్విఫ్ట్ డిజైర్ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు.
కాగా, ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నార్సింగ్ నుండి శంషాబాద్ వైపు వెళ్తుండగా హిమాయత్‌సాగర్ వద్ద ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.