శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 డిశెంబరు 2021 (13:51 IST)

బాలికపై ఐదుగురి సామూహిక అత్యాచారం

ఇంటి నుంచి అదృశ్యమైన బాలిక అత్యాచారానికి గురైన ఘటన సుల్తాన్ బజార్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నవంబర్ 30 రాత్రి బాలిక ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లితండ్రులు సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరపగా డిసెంబర్ 3న బాలికను గుర్తించారు.
 
బాలికను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా తనపై ఐదుగురు అత్యాచారం చేశారని వెల్లడించింది. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.