మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 1 డిశెంబరు 2020 (10:50 IST)

గ్రేటర్ ఎన్నికలు.. ఓటు వేసేందుకు ఆసక్తి చూపని హైదరాబాదీలు

గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా హైదరాబాదీలు ఇప్పటి వరకు ఓటు వేసేందుకు ఆసక్తి చూపడంలేదు. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా.. తొలి రెండు గంటల్లో మందకొడిగా పోలింగ్ సాగింది. మొదటి రెండు గంటల్లో కేవలం 4.2 శాతం మాత్రమే పోలింగ్ నమోదు అయ్యింది. 
 
ఎప్పటిలాగే ఇప్పుడు కూడా ఓటింగ్‌కు గ్రేటర్ వాసులు ఆసక్తి చూపడంలేదు. ఇక ఓటు హక్కు వినియోగించుకుంటున్న అధికారులు, ప్రముఖులు.. తప్పనిసరిగా తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని పిలుపునిస్తున్నారు.
 
గత రెండు ఎన్నికల్లో పోలింగ్ 50 శాతం మించలేదు. ఐదేళ్ల పాటు నగర భవిష్యత్‌ను ఎవరికి అప్పగించాలో నిర్ణయించే ఎన్నికలను ఓటర్లు లైట్ తీసుకుంటున్నారు. ఇంటి నుంచి బయటకు వచ్చి ఓటేసేందుకు ఆసక్తి చూపలేదు. 
 
సాధారణ ఎన్నికల్లో కంటే గ్రేటర్ ఎన్నికల్లో పోలింగ్ శాతం తక్కువగా ఉంటుందంటే.. పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గత రెండు ఎన్నికల్లో పోలింగ్ జరిగిన తీరు చూస్తే.. ఓటర్ల నిరాశక్తత ఏంటో తెలుస్తుంది.