శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By srinivas
Last Modified: ఆదివారం, 30 సెప్టెంబరు 2018 (17:22 IST)

ప్రేమ వివాహం... తండ్రి తిరిగొచ్చేలోపుగానే సూసైడ్ చేసుకున్న టెక్కీ

అత్తిండి వేధింపులు తాళలేక కొత్తగా పెళ్లైన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన రూపిణి(25) ప్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకుని చనిపోయింది.

అత్తిండి వేధింపులు తాళలేక కొత్తగా పెళ్లైన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన రూపిణి(25) ప్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకుని చనిపోయింది. ఏలూరుకు చెందిన సందీప్‌ను మార్చి నెలలో  ప్రేమ వివాహం చేసుకున్నారు రూపిణి. 
 
సందీప్ హైదరాబాదులో జిమ్‌ ట్రైనర్‌గా పనిచేస్తున్నారు. ఏప్రిల్ నెలలో హైదరాబాద్ చిత్రపురి కాలనీలో కాపురం పెట్టారు. అయితే ఈ ప్రేమ వివాహం సందీప్‌ తల్లితండ్రులకు ఇష్టం లేదని సమాచారం. రూపిణి ఆత్మహత్యకు భర్త, అత్తమామల వేధింపులే కారణమని పోలీసులు చెపుతున్నారు. 
 
సందీప్ ఫ్యామిలీ మంచివాళ్ళు కాదు అని మాకు తెలిసినా, అమ్మాయి ఇష్టాన్ని కాదనలేక పెళ్లి చేసామని రూపిణి తండ్రి వాపోతున్నారు. పెళ్లి సమయంలో కట్నకానుకలు వద్దు అన్నారు. ఘనంగా పెళ్లి చేయమన్నారు. పెళ్లి జరిగిన రెండు నెలల నుంచి వేధించడం మొదలుపెట్టారని ఆవేదన వ్యక్తం చేసారు రూపిణి తండ్రి. 
 
మా ఆస్తి తన పేరున రాసివ్వమని భర్త సందీప్, సందీప్ తల్లి వేధిస్తున్నారని మా కూతురు ఏడుస్తూ ఫోన్ చేసిందని 3 రోజుల క్రితం హైదరాబాద్ వచ్చానని, నిన్న రాత్రి తిరిగి ఏలూరు వెళ్తుంటే మా అమ్మాయి ఫోన్ చేసి నాన్న మళ్ళీ ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పడంతో మార్గంమధ్యలోనే బస్ దిగి ఉదయం హైదరాబాద్ వచ్చానని, ఉదయం టిఫిన్ తీసుకురావడానికి బయటకు వచ్చి తిరిగి వెళ్లేలోపే తన కూతురు ఉరి వేసుకు చనిపోయిందని రూపిణి తండ్రి విలపిస్తున్నాడు.