ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 3 సెప్టెంబరు 2023 (15:55 IST)

తెలంగాణాకు భారీ వర్షాలు.. ఆరెంజ్ అలెర్ట్

rain
తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఆ రాష్ట్రానికి ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది. వచ్చే మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ కారణంగా కొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్, మరికొన్ని జిల్లాలలకు ఆరెంజ్ అలెర్ట్‌ను జారీచేసింది. 
 
ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల ఆదివారం నుంచి మంగళవారం వరకు తేలికపాటి నుంచి భారీ, అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ముఖ్యంగా, ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్ధిపేట జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
 
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, వరంగల్, హనుమకొండ, మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.