శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

ఆగస్టు నెలలో 122 సంవత్సరాల తర్వాత అత్యల్ప ఉష్ణోగ్రత

rain
కరోనా మహమ్మారి తర్వాత వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో అకాల వర్షాలు విస్తారంగా కురిశాయి. వర్షాలు కురవాల్సిన సమయంలో ఇవి కురవలేదు. దీనికి ఉదాహరణే. జూలై, ఆగస్టు నెలలు. జూలై నెలలో భారీ వర్షాలతో బెంబేలెత్తించిన వరుణుడు ఆగస్టులో మాత్రం ముఖం చాటేశాడు. 
 
ఏకంగా 122 సంవత్సరాల తర్వాత ఆగస్టులో అత్యల్ప వర్షపాతం నమోదైంది. 1971-2000ను ప్రాతిపదికగా తీసుకుంటే దేశంలో ఆగస్టు నెలలో సగటున 254.9 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా సాధారణం కంటే 36 శాతం తక్కువగా 162.7 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. 2005లో 191.2 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది.
 
ఈ ఆగస్టులో దక్షిణ భారతదేశంలో 190.7 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా సాధారణం కంటే ఏకంగా 60 శాతం తక్కువగా 76.4 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. గత 122 సంవత్సరాల్లో ఇదే అత్యల్పం. అంతకుముందు 1968లో ఇదే నెలలో 89.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు భారత వాతావరణశాఖ తెలిపింది.