గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 ఆగస్టు 2023 (12:02 IST)

తెలుగు రాష్ట్రాలకు సెప్టెంబరు ఒకటో తేదీ వరకు వర్ష సూచన

rain
రెండు తెలుగు రాష్ట్రాలకు సెప్టెంబరు ఒకటో తేదీ వరకు వర్ష సూచన ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండీ హెచ్చరించింది. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా ఈ వర్షాలు కురుస్తాయని తెలిపింది. 
 
దీనికితోడు బంగాళాఖాతంలో అల్పడీన పరిస్థితులు కొనసాగుతున్నాయని, తెలంగాణాలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు పెద్దపల్లి, కొమరం భీం, అసిఫాబాద్, కరీంనగర్, మంచిర్యాల, ములుగు, ఖమ్మం, మహబూబాబాద్, జనగాం, సిద్ధిపేట్, యాదాద్రి, వరంగల్, కొత్తగూడెం జిల్లాలలు ఎల్లో అలెర్ట్ జారీచేసింది. 
 
అలాగే, మరికొన్ని జిల్లాల్లో పొడి వాతావరణం మరికొన్ని రోజుల పాటు కొనసాగనుందని తెలిపింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది. ఆదివారం కూడా కొన్ని చోట్ల భారీ వర్షాలకు అవకాశముందని తెలిపింది.