గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 13 అక్టోబరు 2021 (13:15 IST)

ప్రేమించి పెళ్లి చేసుకుని భార్యను అలా చేసి పారిపోయిన భర్త

ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలం కాపురం కూడా చేశాడు. ఇంతలో ఏమైందోగానీ, భార్య చేతిని కత్తిరించి పారిపోయాడో భర్త. ఈ దారుణం హైదరాబాద్ నగరంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ముంబైలో నివసించే హసి (22), జూబ్లీహిల్స్‌లోని వెంకటగిరికి చెందిన రవి నాయక్‌‌ల మధ్య ఫేస్‌బుక్‌ పరిచయం ఏర్పరచింది. రవి నాయక్‌ ఇటీవల ఆమెను పెళ్లి చేసుకొని నగరానికి తీసుకొచ్చాడు. హసి బ్యూటీషియన్‌గా పని చేస్తుండగా రవినాయక్‌ ఖాళీగా ఉన్నాడు. 
 
ఈ నెల 10వ తేదీన తనకు రూ.50 వేలు కావాలంటూ రవి నాయక్‌ భార్యను అడిగాడు. అందుకు ఆమె తన వద్ద లేదని చెప్పింది. అంతే ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన భర్త.. భార్యను తీవ్రంగా కొట్టి కత్తితో ఓ వేలిని కట్‌ చేసి పారిపోయాడు. 
 
మరోసటి రోజు ఫోన్‌ చేసి డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో రవి నాయక్‌పై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న రవి నాయక్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.