శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 4 సెప్టెంబరు 2021 (16:18 IST)

బంజారాహిల్స్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత

హైదరాబాద్ బంజారాహిల్స్‌లో భారీ డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీఐపీలు నివశించే ఈ ఏరియాలో అక్రమంగా డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నారన్న పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్‌ ఎన్స్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు పలు అనుమానిత ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. 
 
ఈ సోదాల్లో 30 గ్రాముల ఎండీఎంఏ, 4 బోల్ట్స్ ఎల్‌ఎస్డీ, 50 గ్రాముల ఛరాస్, 10 కేజీల గంజాయిని సీజ్ చేశారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వీరిని హైదరాబాద్‌కు చెందిన మద్ది శివశంకర్ రెడ్డి, గంధం మణికాంత్, డార్జిలింగ్‌కు చెందిన శిల్పానుగా గుర్తించారు. ఈ ముగ్గురు నుంచి రెండు బైకులు, నాలుగు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.