శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : బుధవారం, 29 నవంబరు 2017 (10:03 IST)

మెట్రో కిటకిట.. ఫస్ట్‌జర్నీ కోసం పోటీపడుతున్న జనాలు

హైదరాబాద్ నగర వాసులకు మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. మెట్రోలో ఫస్ట్ జర్నీ చేసేందుకు భాగ్యనగరం వాసులు పోటీపడుతున్నారు. దీంతో మెట్రో స్టేషన్లు కిటకిటలాడిపోతున్నాయి.

హైదరాబాద్ నగర వాసులకు మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. మెట్రోలో ఫస్ట్ జర్నీ చేసేందుకు భాగ్యనగరం వాసులు పోటీపడుతున్నారు. దీంతో మెట్రో స్టేషన్లు కిటకిటలాడిపోతున్నాయి. 
 
హైదరాబాద్ మెట్రో రైల్ సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం ప్ర్రారంభించిన విషయం తెల్సిందే. బుధవారం నుంచి భాగ్యనగరం వాసులకు ఈ సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఫస్ట్ జర్నీ చేసి, మెట్రో రైలు ప్రయాణ అనుభూతిని పొందేందుకు నగరవాసులు పోటీ పడుతున్నారు. 
 
ఈ సేవల్లో భాగంగా, నాగోల్ టు మియాపూర్ వరకు మెట్రో రైలు జర్నీ మొదలైంది. బుధవారం తెల్లవారుజాము నుంచే ఫస్ట్ జర్నీ చేసేందుకు సిటీ జనం స్టేషన్లకు తరలివస్తున్నారు. దీంతో టిక్కెట్ కౌంటర్లు ప్రయాణికులతో కిటకిటలాడాయి. ఇక ఇప్పటికే స్మార్ట్ కార్డులు తీసుకున్న వారు నేరుగా మెట్రో ఎక్కేస్తున్నారు.
 
ఉదయం ఆరు గంటలకు ఒక రైలు నాగోలు స్టేషన్‌లో, మరో రైలు మియాపూర్‌ స్టేషన్‌లో బయల్దేరాయి. మెట్రోలో తొలిరోజు ప్రయాణించేందుకు ప్రజలు ఉత్సాహం చూపిస్తున్నారు. మొదటి రోజు సుమారు లక్షమంది ప్రయాణించే అవకాశం ఉందని అంచనా వేశారు. ప్రతి పావుగంటకు ఒక రైలు చొప్పున మొత్తం 18 రైళ్లను నడుపనున్నారు.
 
మియాపూర్‌ - నాగోలు 27.6 కిలోమీటర్ల మార్గంలో మొత్తం 24 మెట్రో స్టేషన్లున్నాయి. వీటి మధ్య ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలంటే ప్రస్తుతం రెండు గంటల సమయం పడుతోంది. అదే మెట్రోలోనైతే 64 నిమిషాల్లోనే ఆ చివరి నుంచి ఈ చివరికి చేరుకోవచ్చు. సాంకేతిక సర్దుబాట్ల తర్వాత ఈ సమయం మరింత తగ్గుతుందని మెట్రో వర్గాలు చెప్పాయి.