శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 8 జులై 2023 (19:23 IST)

నవజాత శిశువుకు ముక్కు లేకుండా చేసిన వైద్యులు

baby boy
హైదరాబాద్ వైద్యులు ఓ నవజాత శిశువుకు ముక్కు లేకుండా చేశారు. ఇన్ఫెక్షన్ సోకిందని చెప్పి ఆ పాప ముక్కు తీసేశారు. దీంతో దీంతో లేక లేక పుట్టిన చిన్నారి పరిస్థితి చూసి ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. 
 
ఈ ఘటన హైదరాబాదులోని నారాయణగూడలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. పాతబస్తీ కాలా పత్తర్ కు చెందిన ఇమ్రాన్ ఖాన్, హర్షన్నుస్సా ఖాన్ దంపతులకు 13 ఏళ్ల తర్వాత జూన్ 8న లేక లేక పండంటి బిడ్డ పుట్టింది. పుట్టిన బిడ్డకు ఫతే ఖాన్ అనే పేరు కూడా పెట్టుకున్నారు. 
 
అయితే, పుట్టిన వెంటనే శిశువు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడని గమనించిన వైద్యులు వెంటనే ఎన్ఐసీయూలోకి మార్చారు. అప్పటి నుంచి శిశువు ఎన్ఐసియూ లోనే ఉంది. అయితే ఇన్ఫెక్షన్ సోకిందని.. ముక్కు లేకుండా చేశారు. 
 
ఈ ఘటనపై వైద్యులు మాట్లాడుతూ.. బాబుకి ఇన్‌ఫెక్షన్  సోకిందని తెలిపారు. చిన్నారికి ఏడాది వయసు వచ్చిన తర్వాత ముక్కును సరిచేసే ప్రయత్నం చేస్తామన్నారు. ఇక పూర్తి స్థాయిలో ముక్కుకి ప్లాస్టిక్ సర్జరీ చేయాలంటే 10 సంవత్సరాల తర్వాతే వీలవుతుందన్నారు. దీని మీద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.