సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Updated : బుధవారం, 9 మే 2018 (19:15 IST)

మా ఆయన లేడు... పిల్లలు సిన్మాకెళ్లారు వచ్చేయ్... అని పిలిచి తర్వాత కుళ్లబొడిచింది...

ఆమె వయసు 40 ఏళ్లు. ఇద్దరు పిల్లలు, భర్త వున్నారు. ఓ ప్రముఖ ప్రైవేట్ కాలేజీలో హెల్పర్‌గా పనిచేస్తోంది. ఐతే అదే కాలేజీలో వంట పని చేస్తున్న మరో వ్యక్తితో స్నేహం కుదిరింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి

ఆమె వయసు 40 ఏళ్లు. ఇద్దరు పిల్లలు, భర్త వున్నారు. ఓ ప్రముఖ ప్రైవేట్ కాలేజీలో హెల్పర్‌గా పనిచేస్తోంది. ఐతే అదే కాలేజీలో వంట పని చేస్తున్న మరో వ్యక్తితో స్నేహం కుదిరింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. వివరాల్లోకి వెళితే... హైదరాబాదులోని హయత్ నగర్‌లో 40 ఏళ్ల అంకులమ్మ తన భర్త, పిల్లలతో కలిసి వుంటోంది. నాగర్ కర్నూల్ నుంచి గత తొమ్మిదేళ్ల క్రితమే ఇక్కడకి వచ్చి స్థిరపడ్డారు. కాగా భర్త ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అంకులమ్మ కూడా ఓ ప్రైవేట్ కళాశాలలో పనిచేస్తోంది. 

 
ఈ క్రమంలో నరేందర్ అనే వ్యక్తితో పరిచయమైంది. ఇది వివాహేతర సంబంధానికి దారితీసింది. అవకాశం దొరికినపుడల్లా ఇద్దరూ లైంగిక సుఖాన్ని చవిచూస్తూ వచ్చారు. ఈ క్రమంలో తన భర్త లేని సమయంలో కుమారులిద్దరినీ ఫస్ట్ షో సినిమాకు పంపించింది. ఆ తర్వాత నరేందర్‌ను పిలిచింది. లైంగిక సుఖం చవిచూశారిద్దరూ. అర్థరాత్రి కావస్తుండటంతో ఇక ఇంటి నుంచి వెళ్లిపోవాలని అతడితో చెప్పింది. కానీ అతడు ఆమె మాటలు వినలేదు. అక్కడే వుంటానని మొండికేశాడు. దీనితో అంకులమ్మకు భయం పట్టుకుంది. 
 
తన పిల్లలిద్దరూ సినిమా నుంచి వచ్చేసరికి అతడు అక్కడే వుంటే ప్రమాదం తప్పదని భావించి సినిమా చూస్తున్న పిల్లలిద్దరికీ ఫోన్ చేసి నరేందర్ తనను వేధిస్తున్నాడని తెలిపింది. దీనితో వాళ్లిద్దరూ ఆవేశంతో ఇంటికి వచ్చారు. ఎడాపెడా ఇద్దరూ కలిసి నరేందర్ పైన దాడి చేశారు. అంకులమ్మ కూడా కలిసి కుళ్లబొడిచారు. దాంతో నరేందర్ స్పృహ కోల్పోయాడు. ఆ తర్వాత అతడిని రాత్రిపూటే అతడి ఇంటి వద్ద వదిలేసి వచ్చేశారు. ఉదయాన్నే తనపై జరిగిన దాడిని తన స్నేహితులకు వెల్లడించాడు నరేందర్. 
 
కీలక అవయవాలకు కనబడని దెబ్బలు తగలడంతో అతడు నీరసించాడు. రోడ్డుపై నడిచి వెళ్తూ వెళ్తూ తూలిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. శవాన్ని పరీక్షించిన వైద్యులు అతడికి శరీరం లోపల కనబడని దెబ్బలు తగలడంతో చనిపోయినట్లు తేల్చారు. దీనికి కారణమైన అంకులమ్మను పోలీసులు అరెస్టు చేశారు. ఆమె ఇద్దరు కుమారులను బాల నేరస్థుల కారాగారానికి తరలించారు.