శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 14 జూన్ 2023 (19:13 IST)

భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి నివాసంలో ఐటీ సోదాలు

pailla sekhar reddy
తెలంగాణ రాష్ట్రంలోని భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి నివాసంలో ఆదాయపన్ను శాఖ అధికారులు బుధవారం తనిఖీలు చేపట్టారు. ఏకంగా 12 ప్రాంతాల్లో ఉదయం నుంచి ఏకకాలంలో ఈ సోదాలు మొదలుపెట్టారు. భువనగిరి, హైదరాబాద్ నగరంలో ఉన్న ఎమ్మెల్యేకు చెందిన నివాసాలు, కార్యాలయాల్లో ఈ సోదాలు చేశారు. 
 
అలాగే, మెయిన్ ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీస్ లిమిటెడ్, హిల్ ల్యాండ్ టెక్నాలజీస్‌లో కూడా సోదాలు చేశారు. ఈ రెండు కంపెనీలకు శేఖర్ రెడ్డి భార్య వనిత డైరెక్టరుగా ఉన్నారు. ఈ సోదాల్లో దాదాపు 30 బృందాలు పాల్గొన్నాయి. కంపెనీల లావాదేవీలు, ఆదాయపన్ను చెల్లింపుల వివరాలను ఐటీ అధికారులు పరిశీలించారు.

కేంద్ర బలగాల భద్రత మధ్య ఈ సోదాలు చేశారు. ఈ దాడుల నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు, శ్రేణుల్లో ఉత్కంఠత నెలకొంది. అలాగే, అలాగే, బీఆర్ఎస్ కొత్త ప్రభాకర్ రెడ్డి, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే జనార్థన్ రెడ్డిల నివాసాల్లో కూడా సోదాలు జరిగాయి.