మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్

పూరీ జగన్నాథ యాత్రకు ప్రత్యేక రైళ్ళు... ఎక్కడ నుంచి?

train
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పూరీ జగన్నాథ యాత్రకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు వస్తారు. అలాగే, దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు ఈ యాత్రను ప్రత్యక్షంగా చూసేందుకు వెళుతుంటారు. ఈ భక్తులను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ నగరం నుంచి పూరీకి ప్రత్యేక రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఈ నెల 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని  పేర్కొంది. ఈ రైళ్లలో ప్రయాణించేందుకు రిజర్వేషన్ సౌకర్యం ఇప్పటికే ప్రారంభమైందని, ఏసీ, నాన్ ఏసీ బోగీల సదుపాయం కల్పించినట్టు తెలిపారు. అలాగే అన్‌ రిజర్వుడ్ కోచ్‌లు ఉన్నాయని తెలిపింది. 
 
ఈ నెల 18వ తేదీన సికింద్రాబాద్ నుంచి మలాటిపట్పూర్, 19న మలాటిపట్పూర్ నుంచి సికింద్రాబాద్, 19న నాందేడ్ నుంచి ఖుర్దా రోడ్, 20న ఖుర్దా రోడ్ నుంచి నాందేడ్‌కు, 21న కాచిగూడ నుంచి మలాటిపట్పూర్, 21న మలాటిపట్పూర్ నుంచి కాచిగూడకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ రైల్వే అధికారులు విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.