ఆదివారం, 6 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 23 డిశెంబరు 2022 (14:02 IST)

కైకాలకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు : మంత్రి తలసాని

Talasani Srinivasa Yadav
అనారోగ్యం కారణంగా మృతి చెందిన తెలుగు సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తుందని తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖామంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం వేకువజామున మృతి చెందిన కైకాల భౌతకకాయానికి జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మంత్రి నివాళులు అర్పించారు. 
 
ఆ తర్వాత ఆయన మీడియో మాట్లాడుతూ, కైకాల అంత్యక్రియలను అధికారిక లాంఛలనాలతో నిర్వహిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు కైకాల అత్యంక్రియలను ప్రభుత్వపరంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పారు. మూడు తరలా పాటు అనేక చిత్రాలు, వివిధ పాత్రలలో తన నటనతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకున్న సత్యనారాయణ మృతి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటని ఆయన చెప్పారు.