సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 2 జూన్ 2022 (11:46 IST)

నిఖత్ జరీన్, షూటర్ ఈషాకి కేసీఆర్ రూ. 2 కోట్లు బహుమతి

Nikhat Zareen
ప్రపంచ బాక్సింగ్‌ పోటీల్లో ఛాంపియన్‌‌గా నిలిచిన నిఖత్‌ జరీన్‌, షూటర్‌ ఈషా సింగ్‌లు అంతర్జాతీయంగా దేశానికి గర్వకారణమైన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం నాడు 2 కోట్ల రూపాయల నగదు బహుమతిని వారిద్దరికీ ప్రకటించారు.

 
ఇద్దరు క్రీడాకారులకు జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లో ఇళ్ల స్థలాలు ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. నిఖత్ జరీన్ ఇటీవల ఇస్తాంబుల్‌లో జరిగిన 52 కిలోల విభాగంలో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించింది.

 
ఇదిలా ఉండగా జర్మనీలో ఇటీవల ముగిసిన ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచ కప్‌లో టీమ్ ఈవెంట్‌లలో ఈషా సింగ్ మూడు బంగారు పతకాలను గెలుచుకుంది. అంతకుముందు, నిఖత్ జరీన్ శిక్షణ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం 2014లో రూ. 50 లక్షలను రివార్డుగా ఇచ్చింది.