సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జె
Last Modified: శుక్రవారం, 11 మార్చి 2022 (12:51 IST)

కెసిఆర్... ఇక ఆపు నీ ఫ్రంట్లు, తెలంగాణలో భాజపా జెండా రెపరెపలు ఖాయం: డి.కె.అరుణ

ఫ్రంట్ల పేరుతో ఆర్భాటాలకు పోయి తెలంగాణా రాష్ట్రంలో కెసిఆర్ తన ప్రాభవాన్ని కోల్పోతున్నారని బిజెపి నాయకురాలు డి.కె. అరుణ అన్నారు. నాలుగు రాష్ట్రాల్లో బిజెపి గెలుపు కెసిఆర్‌తో పాటు విమర్సలు చేసిన అందరికీ చెంపపెట్టు లాంటి సమాధానమన్నారు. 

 
బిజెపి భారీ విజయంతో తిరుమల శ్రీవారిని అరుణ కుమారి దర్సించుకున్నారు. కెసిఆర్, టిఆర్ఎస్ పార్టీపై తెలంగాణాలో తీవ్రంగా వ్యతిరేకత ఉందని.. టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బిజెపి అని తెలంగాణా ప్రజలు భావిస్తున్నారన్నారు.

 
తెలంగాణాలో ఖచ్చితంగా బిజెపి అధికారంలోకి వస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు నమ్మరన్నారు. బిజెపి జెండా తెలంగాణాలో ఎగిరి తీరుతుందన్న ధీమాను వ్యక్తం చేశారు.