ఆదివారం, 19 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : శనివారం, 4 నవంబరు 2023 (19:10 IST)

వేంకటేశ్వర స్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలతో కేసీఆర్ ప్రత్యేక పూజలు

kcr
తెలంగాణ రాష్ట్రంలో సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం కోయినాపల్లి గ్రామ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు చేసుకున్నారు. ప్రతి ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ నామినేషన్ వేయడానికి ముందు ఈ ఆలయాన్ని సందర్శించడం ఆనవాయితీగా వస్తుంది. నామినేషన్ పత్రాలతో ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి విజయాన్ని ప్రసాదించాలని ఆయన స్వామివారిని వేడుకున్నారు.
kcr
 
కాగా, ఈ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగుతున్న కేసీఆర్ తాను దాఖలు చేయనున్న నామినేషన్ పత్రాలకు పూజలు చేశారు. ఉదయం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి రోడ్డు మార్గం ద్వారా గ్రామానికి చేరుకుని వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. నామపత్రాలను స్వామి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. సీఎం కేసీఆర్ ఈ నెల 9న ఉదయం గజ్వేల్‌లో మధ్యాహ్నం కామారెడ్డి నామపత్రాలు దాఖలు చేశారు.