సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Raju
Last Modified: హైదరాబాద్ , మంగళవారం, 28 మార్చి 2017 (07:24 IST)

కేటీఆర్ పవన్ కల్యాణ్ ఎందుకు భేటీ అయినట్లు? తన్నుకు చస్తున్న సోషల్ మీడియా

తెలంగాణ ఐటీ మంత్రి కె.తారకరామారావు పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో సెల్ఫీ దిగడం ఈ సంవత్సరం వార్తగా మారింది. పైగా పవన్ తాజా చిత్రం కాటమరాయుడు సినిమా బాగుందని కేటీఆర్ ప్రశంసించడం కూడా జరిగిపోయింది. పవన్ కూడా కేటీఆర్ తనకు శుభాకాంక్షలు తెలిపినట్లు ట్వీట్ చేశ

తెలంగాణ ఐటీ మంత్రి కె.తారకరామారావు పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో సెల్ఫీ దిగడం ఈ సంవత్సరం వార్తగా మారింది. పైగా పవన్ తాజా చిత్రం కాటమరాయుడు సినిమా బాగుందని కేటీఆర్ ప్రశంసించడం కూడా జరిగిపోయింది. పవన్ కూడా కేటీఆర్ తనకు శుభాకాంక్షలు తెలిపినట్లు ట్వీట్ చేశాడు కూడా. కానీ కేటీఆర్-పవర్ స్టార్ సెల్పీ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ టీడీపీ-బీజేపీ కూటమికి ప్రచారం చేశారు. అప్పట్లో పవన్ స్పష్టంగానే టీఆరెస్ వ్యతిరేక వైఖరిని ప్రదర్శించారు కూడా. 
 
అయితే ఎన్నికల తర్వాత తెరాస ప్రభుత్వానికి పవన్ ఎలాంటి చిక్కులూ కలిగించలేదు. పైగా గత సంవత్సరం జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల్లో కూడా అధికార పార్టీ ప్రజల తీర్పును సంపూర్ణంగా పొందాల్సి ఉందని చెబుతూ పవన్ పోటీ చేయనని చెప్పారు. తెరాస నుంచి కూడా పవన్‌పై విమర్శలు బాగా తగ్గుముఖం పట్టాయి. 
 
అయితే రెండు రాష్ట్రాల్లోనూ జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుందని పవన్ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో కేటీఆర్‌తో భేటీ కావడం విశేషం. పైగా తెలంగాణలో తొలి సమస్యగా  సంగారెడ్డి జిల్లాలోని కాలుష్యాన్ని చేపడతానని పవన్ ప్రకటించారు. తెలంగాణలోనూ పోటీ చేస్తానని పవన్ కల్యాణ్ ప్రకటించిన నేపథ్యంలో కేటీఆర్‌తో తను భేటీ కావడం మర్యాదపూర్వకంగా కాదని ఈ భేటీ వెనుక ఏదో బలమైన కారణమే ఉందని భావిస్తున్నారు. 
 
తెలంగాణలో పూర్తిగా దెబ్బతినిపోయిన తెలుగుదేశం స్థానంలో జనసేన అడుగు పెట్టనుందా.  ఇక్కడ కోరలు పీకేయబడిన టీడీపీ జనసేనకు లోపాయకారీగా మద్దతిచ్చి పరోక్షంగా పాగా వేయదలిచిందా. లేక పోటీ చేసే మాటే వస్తే మనం కలిసే పోట చేద్దామని కేటీఆర్ తెరాస తరపున హింట్ ఇచ్చారా.. తెలంగాణలో పవన్ కున్న ప్రజాదరణ రీత్యా తనను తేలికగా తీసుకునే పరిస్థితి లేదు. 
 
అందుకే ఈ భేటీ వెనుక ఉన్న కారణాలు స్పష్టంగా తెలీకున్నా బలమైన కారణమే ఉందని జనం భావిస్తున్నారు. ఏనాటికైనా ఈ విషయం బయటపడక తప్పదన్నది జనం భావన