గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : శనివారం, 23 డిశెంబరు 2017 (15:46 IST)

బూటు కాలితో తన్నడం సరే.. వీడియో ఎవరు తీశారో తేలుస్తాం : డీసీపీ విశ్వప్రతాప్

విచారణ నిమిత్తం స్టేషన్‌క పిలిచి లఘు చిత్ర దర్శకుడు యోగిని మాదాపూర్ అడిషినల్ డీసీపీ గంగిరెడ్డి బూటు కాలితో తన్నడం, చెంపపై లాగి కొట్టిన వ్యవహారం పెనుసంచలనమైంది.

విచారణ నిమిత్తం స్టేషన్‌క పిలిచి లఘు చిత్ర దర్శకుడు యోగిని మాదాపూర్ అడిషినల్ డీసీపీ గంగిరెడ్డి బూటు కాలితో తన్నడం, చెంపపై లాగి కొట్టిన వ్యవహారం పెనుసంచలనమైంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ విచారణకు ఆదేశించారు. 
 
దీంతో మాదాపూర్ డీసీపీ విశ్వప్రతాప్ ఈ వ్యవహారంపై శనివారం విలేకరులతో మాట్లాడారు. పోలీసుల ముందే నటి హారికను అసభ్యకరంగా మాట్లాడినందుకు యోగీపై ఏడీసీపీ గంగిరెడ్డి యాక్షన్ తీసుకోవడం జరిగిందని, అయితే స్టేషన్‌లో ఈ వీడియో ఎవరు తీశారనేదానిపై విచారణ జరుపుతామన్నారు. ఆ వీడియో సెల్‌ఫోన్‌లో వచ్చిందా? లేదా? ఎవరైనా కెమెరాతో తీశారా అన్నదానిపై విచారిస్తున్నామన్నారు. 
 
ఫిర్యాదు చేసిన అమ్మాయి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అని ఆమె కూడా కొన్ని షార్ట్ ఫిలిమ్స్‌లో నటించిందన్నారు. ఈ కేసుపై సీపీతో సమావేశమయ్యాక వీడియోపై విచారణ జరుపుతామన్నారు. తప్పకుండా ఈ వీడియో తీసినవారు ఎవరో తేలుస్తామన్నారు. ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో వేధిస్తున్నారంటూ అమ్మాయిల నుంచి షీటీమ్స్‌కు ఫిర్యాదులు వస్తున్నాయని, అలాంటి వారికి కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు.
 
కాగా, ఇక్కడ బూటు కాలితో తన్నడం కంటే ముందస్తు అనుమతి లేకుండా పోలీసు స్టేషన్‌లో జరిగిన ఘటనను వీడియో ఎవరు తీశారో తేలుస్తామని చెప్పడం గమనార్హం. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అమలు చేస్తున్నామని చెపుతున్న హైదరాబాద్ నగర పోలీసులు తెరచాటున సాగిస్తున్న అరాచకం ఈ వీడియోతో బహిర్గతమైంది. దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు.