గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 21 ఆగస్టు 2022 (13:31 IST)

భార్యపై అనుమానం... కిరాతకుడిగా మారిపోయిన భర్త

murder
భార్యపై అనుమానంతో భర్త కిరాతకుడిగా మారిపోయాడు. ఇద్దరు పిల్లల కళ్లముందే.. భార్యను గొంతుకోసి కిరాతకంగా హతమార్చాడు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధి, పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీకి చెందిన కంది చంద్రయ్య కూతురు దివ్యభారతి(33)కి హైదరాబాద్ అంబర్‌పేట ప్రాంతానికి చెందిన పుస్తకాల దీపక్‌ (40)తో 12 ఏళ్ల క్రితం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు సంతానం. బాబు ఐదు, పాప మూడో తరగతి చదువుతున్నారు. 
 
వివాహ సమయంలో కట్నకానుకలు భారీగానే ఇచ్చినా దీపక్ అదనపు కట్నం, అనుమానంతో ఆమెను వేధిస్తూ ఉండేవాడు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత నిద్రలో ఉన్న దివ్యభారతిపై దాడికి పాల్పడ్డాడు. ఆమె పెద్దగా కేకలు వేయడంతో పిల్లలు నిద్రలేచారు. వారు చూస్తుండగానే దీపక్ కత్తితో భార్య గొంతుకోసి చంపేశాడు.
 
అర్ధరాత్రి ఆ ఇంట్లో నుంచి కేకలు, పిల్లల ఏడుపులు విన్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలెట్టారు.