మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 22 జనవరి 2022 (17:20 IST)

ఆరేళ్ల బాలికపై అత్యాచారయత్నం.. 28 ఏళ్ల వ్యక్తికి దేహశుద్ధి

వయోబేధం లేకుండా మహిళలపై అత్యాచారాలు చోటుచేసుకుంటున్నాయి. చిన్నారులపై కూడా అకృత్యాలకు అవధుల్లేకుండా పోతున్నాయి. ఎన్ని చట్టాలు చేసినా.. ఎంత కఠిన శిక్షలు వేసిన కామాంధులు మాత్రం మారడం లేదు.
 
చిన్నారులపై కామాంధులు విరుచుకుపడుతున్నారు. తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గణపురం మండలం అప్పయ్యపల్లి గ్రామంలో నిన్న 6 ఏళ్ల చిన్నారిపై గుర్రం కిషోర్ (28) అనే వ్యక్తి అత్యాచారయత్నం చేశాడు. అయితే సదరు అమ్మాయి తమ్ముడు అరవడంతో నిందితుడు గుర్రం కిషోర్ పారిపోయాడు. 
 
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసుల సమక్షంలో నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు గ్రామస్తులు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.